![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1094 లో... లక్కీని మదన్ రూమ్ లోనే ఉండమని రేఖ చెప్పగానే అందరు షాక్ అవుతారు. కొన్ని రోజులు అడ్జెస్ట్ అవ్వమని రేఖ చెప్పగానే మాధన్ కోపంగా లోపలికి వెళ్తాడు. మరొకవైపు నందు, వెంకీ వెళ్తూ ఇక్కడ ఆపురా.. లోపల ఫైల్ ఉందని నందు అంటుంది. ఇది దుగ్గిరాల ఇల్లు.. మా వదిన వాళ్ళ ఇల్లు కదా.. ఇక్కడ నీ ఫైల్ ఉండడం ఏంటని వెంకీ అడుగుతాడు.
నేను కుడా ఇక్కడే ఉంటున్నా నీకు చెప్పలేదు కదా.. నేను ఈ దుగ్గిరాల ఇంటికి వారసురాలిని అని నందు చెప్తుంది. ధాన్యలక్ష్మి, ప్రకాష్ కొడుకు కళ్యాణ్ , కోడలు అప్పు ఉన్నారు కదా వారి కళ్యాణ్, అప్పుల కూతురిని అని నందు చెప్పగానే వెంకీ షాక్ అవుతాడు. వాళ్ళ నాన్నకి దుగ్గిరాల ఇంటి వారసురాలిని ప్రేమించనని మాటిచ్చింది గుర్తుచేసుకొని సైలెంట్ గా ఉంటాడు వెంకీ. ఒక అయిదు నిమిషాలు ఆగురా లోపల ఫైల్ తీసుకొని వస్తానని నందు అంటుంది. నాకు పని ఉందని చెప్పి వెంకీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నందు లోపలికి వస్తుంటే ఇందు ఎదురుపడి ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. కేసు గురించి అంటే అక్క తిడుతుందని అనుకొని వెంకీతో సరదాగా బయటకు వెళ్ళానని చెప్తుంది. ఏంటి మీరు ఇద్దరు లవ్ లో ఉన్నారా అని ఇందు అడుగుతుంది. వాడు అంటే నాకు ఇష్టం అక్క అని నందు చెప్పగానే ఆ విషయం మరి తనకి చెప్పావా అని ఇందు అడుగుతుంది. లేదు అక్క వాడే చెప్పాలని అనుకుంటున్నానని నందు చెప్తుంది.
అదంతా విని ఇందు నవ్వుకుంటుంది. మరొకవైపు ఐశ్వర్య జరిగిన దానికి కోపంగా ఉంటుంది. తన ఫ్రెండ్ తో పార్టీ లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఎలా అని తన ఫ్రెండ్ అంటుంది. ఇప్పుడు నువ్వు ఇగోగా ఉండొద్దని తన ఫ్రెండ్ ఐశ్వర్యతో అంటుంది. ఆ తర్వాత నీకెలాంటి అమ్మాయి కావాలని రాజుతో ఇందు అడుగుతుంది. రాజు తనకి నచ్చాలంటే అమ్మాయి ఎలా ఉండాలో ఇందుకి చెప్తాడు. తరువాయి భాగంలో లక్కీ, మదన్ కి గొడవ జరుగుతుంది. రేఖ వచ్చి మదన్ ని కొడుతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. రేఖని ఏదో ఆవహించింది అందుకే ఇలా చేస్తుందని భ్రమరాంబతో శేషు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |